Friday, 25 September 2026 06:35:41 PM

కార్పోరేషన్ లోని ప్రతి డివిజన్ ను సుందరంగా మారుస్తున్నాం

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 25 November 2022 03:36 PM Views : 546

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం లోని 42 వ డివిజన్ లో 20 లక్షల పట్టణ ప్రగతి నిధులతో అండర్ గ్రౌండ్ డైనేజీ సి.సి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి ద్వారా నిధులను కేటాయించి ప్రతి డివిజన్ ను సమస్యలు లేకుండా చేస్తుందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ ను సుందరంగా తీర్చి దిద్దుతానన్నారు. ప్రతి డివిజన్ అభివృద్ధి కోసం కోటి రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాలరాజు కుమార్, మేకల సదానందం యాదవ్, కో ఆప్సన్ సభ్యుడు వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు మెతుకు దేవరాజ్, మేడి సదయ్య మెహిద్ సన్నీ ఇరుగురాళ్ల శ్రావన్ మేకల అబ్బాస్ పిల్లి రమేష్, నాగభూషణం శ్రీనివాస్ రెడ్డి చింతల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :