ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం ,ఇసాక్ సన్మానించారు. శనివారం ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఆయన ఛాంబర్ లో ప్రత్యేకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో నిత్యం శ్రమిస్తూ ఎంతో మంది మైనార్టీలకు అండగా నిలిచిన షబ్బీర్ అలీ రాజకీయంగా మరింత అభివృద్ధి సాధించాలని వారు కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన శుభ సందర్భంగా ఆయనను కలుసుకోవడం జరిగిందన్నారు. మైనార్టీల సంక్షేమంతో పాటు షెడ్యూల్ కులాలు, గిరిజన, వెనుకబడిన తరగతుల, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం నియమించిన లక్ష్యాన్ని సాధించుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న షబ్బీర్ అలీ రాజకీయంగా మరింత అభివృద్ధి సాధించి, మైనార్టీల కొండంత అండగా నిలబడాలని ఇబ్రహీం ఆకాంక్షించారు.
Admin
Aakanksha News