Monday, 10 August 2026 01:09:37 PM

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకోవాలి..

దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

Date : 25 November 2024 05:28 PM Views : 600

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకోవాలని, దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి శివారులోని కుందూరుపల్లిలో యంఎస్ఆర్ పత్తి మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కొరకు ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ లో ధరలు పడిపోతున్న సందర్భంలో పత్తికి మద్దతు ధర అందించే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సీసీఐ కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. ఒక క్వింటాల్ పత్తికి రూ.7521 ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లో రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :