Tuesday, 11 August 2026 05:43:05 PM

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు..

Date : 15 November 2022 01:15 PM Views : 394

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం రాత్రి ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ.. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ(79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో మహేష్ బాబు భార్య ఆయన్ని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కార్డియాక్ అరెస్ట్ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులపై కూడా పడటంతో కృష్ణ ఆరోగ్యం బాగా విషమించిందని నిన్న వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ కృష్ణ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఒకనాటి యువతుల కలల చెలికాడు. యువతరం మదిని మీటిన మొనగాడు...ప్రజాస్వామ్య విలువలతో వెండితెరను ప్రభావితం చేసిన నటరాజు సూపర్‌ స్టార్‌ క్రిష్ణ యావత్‌ తెలుగు ప్రేక్షక లోకాన్ని దుఃఖసాగరంలో ముంచి దివికేగి ఆకసంలో తారగా నిలిచాడు. కార్డియాక్‌ ఆరెస్ట్‌తో హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ తెల్లవారు ఝామున తుది శ్వాస విడిచారు. తెలుగు తెరను సుదీర్ఘకాలం శాసించిన సన్‌ ఆఫ్‌ ద సాయిల్‌ మరణం తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది.సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ తెల్లవారు ఝామున 4 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించిన కృష్ణ మనసు ఆయన సినిమా పేరుకు తగ్గట్టే తేనె మనసు. తెలుగు సినీ ప్రపంచానికి అంకితం చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :