ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మొదటి రోజు ప్రజాదర్బార్ విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ప్రజాభవన్‌కు వచ్చి తమ సమస్యలను ప్రజాదర్బార్‌లో చెప్పుకున్నారు. ప్రజల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా అర్జీలు తీసుకున్నారు. విజయవంతంగా మొదటి రోజు ప్రజాదర్బార్‌ను ముగించారు. ప్రతీ శుక్రవారం ప్రజాదర్బార్ ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. తొలిరోజు ప్రజాదర్బార్ విశేషాలను సీఎం రేవంత్ ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘‘జనం కష్టాలు వింటూ… కన్నీళ్లు తుడుస్తూ.. తొలి ప్రజా దర్బార్ సాగింది. జనం నుండి ఎదిగి… ఆ జనం గుండె చప్పుడు విని… వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!’’ అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.
Admin
Aakanksha News