ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : లోని కొత్తపేట సరూర్ నగర్ లో గల అనాధ విద్యార్థుల వసతి గృహాన్ని జాతీయ మానవ హక్కులు - మహిళా మరియు శిశు సంరక్షణ సమితి సభ్యులు సందర్శించి అక్కడ ఉన్న విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుకున్నారు. అనంతరం వారికి పుస్తకాలు మరియు పండ్లు పంపిణి చేశారు. విద్యార్దులే ఒక టీమ్ గా ఏర్పడి వసతి గృహాన్ని మెయింటైన్ చెయ్యడం చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యామని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ. తల్లిదండ్రులు లేని వారు మాత్రమే ఆనాధలు కారని మంచి మనసు ఒకింత పరులకు సహాయపడనివారే నిజమైన అనాధలని తెలిపారు.భవిష్యత్తులో వారికి ఎలాంటి సహాయం కావాలన్న సంస్థ వారికి అండగా ఉంటుందని తెలిపారు.గత అయిదు సంవత్సరాలనుండి సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుతుందని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. సంస్థ జాతీయ కార్యదర్శి గూడెపు మాధవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షురాలు అనంతుల పద్మావతి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సుజీత్ గాంధీ, రాష్ట్ర అధ్యక్షుడు కోదండ మురళీధర్ ప్రసాద్, గిరి రాష్ట్ర మహిళా విభాగం సభ్యులు మేఘన, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News