ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈరోజు మంత్రి కేటీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులను, విద్యార్థి యువజన సంఘాల నాయకులను ఎక్కడకక్కడ అదుపులోకి తీసుకొని ఆయా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. మంత్రి రాక సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Admin
Aakanksha News