Friday, 25 September 2026 06:44:29 PM

అమీత్ షా క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు... రాజ్యాంగం మార్చాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది

అంబేద్కర్‌ రాజ్యాంగం అంటే ప్రజలకు ఓ ధైర్యం.... మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

Date : 20 December 2024 05:18 PM Views : 410

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి చాలా తేడా ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. దేవుడిని మొక్కినా రాహుల్‌ పబ్లిసిటీ చేసుకోరన్నారు. శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. బిజెపి వాళ్లు దేవుడిని మొక్కి పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతారని దుయ్యబట్టారు. అంబేద్కర్‌ రాజ్యాంగం అంటే ప్రజలకు ఓ ధైర్యం అని, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే రాజ్యాంగ ఫలితమేనని స్పష్టం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే మోడీ అయినా అమిత్ షా అయినా పదవులు అనుభవిస్తున్నారు రాజ్యాంగం మార్చాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ రక్షణకు రాహుల్ పోరాడుతున్నారని జగ్గారెడ్డి కొనియాడారు.అంబేద్కర్ కు రాజ్యాంగ నిర్మాణానికి ప్రోస్థహించింది ఇచ్చింది జవరహర్ లాల్ నెహ్రూ దాన్ని కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తున్నది నెహ్రూ ముని మనవడు రాహుల్ గాంధీరాజ్యాంగ పరిరక్షణకు పోరాటం చేస్తున్నారు దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ కుట్ర చేసి రాహుల్ గాంధీనీ గత సంవస్తారం పార్లమెంట్ లో ఉండకుండా కుట్రలు చేశారన్నారు.ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ నీ పార్లమెంట్ కి రాకుండా దాడి చేసి అడ్డుకుంటున్నారన్నారు.అయిన అంబేద్కర్ నీ అవమానించిన అమీత్ షా క్షమాపణ చెప్పే వరకు రాహుల్ గాంధీ పోరాటం ఆపడు రాహుల్ గాంధీ ఏ పిలుపు నిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :