ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్‌కర్నూల్ జిల్లా : మిషన్ భగీరథ నీరు రావడం లేదని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలోని ఏడో వార్డులో ప్రజలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీళ్ల సమస్య తీర్చాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Admin
Aakanksha News