Saturday, 26 September 2026 06:16:35 PM

గోదావరిఖనిలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు...

Date : 02 April 2023 06:00 PM Views : 487

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 313 వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ 350 ఏళ్ల క్రితం ఆనాటి పాలకుల దుశ్చర్యలను సర్దార్ సర్వాయి పాపన్న ఎదురించాడని అన్నారు. సైన్యంలో చేరి తర్ఫీదు పొంది, రాజ కోటలను వశపరచుకున్నాడని అన్నారు. అదే క్రమంలో చివరకు గోల్కొండ కోటను కూడా వశపరచుకున్నాడని గుర్తు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :