ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి జిల్లా : మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ సింగరేణి ఉద్యోగిని చితకబాదిన ఘటన పెద్దపెల్లి జిల్లా కమాన్‌పూర్ లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం రామగుండం కమిషనర్ కమీషనరేట్ పరిధిలోని ఎన్టిపిసి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అజయ్ బంధువులతో కలిసి కమాన్‌పూర్ లోని ఓ వైన్స్ షాపులో మద్యం సేవించాడు. అనంతరం తన బైక్ పై వెళ్లే క్రమంలో సింగరేణి ఉద్యోగి బైక్ ను ఢీకొట్టాడు. మద్య మత్తులో ఉన్న కానిస్టేబుల్ అజయ్ కుమార్ 'నా వాహనాన్ని ఢీ కొడతావా 'అంటూ సింగరేణి ఉద్యోగి సమ్మయ్యను కాలుతో తన్నుతూ చితకబాదాడు. స్థానికులు కానిస్టేబుల్ ను ఆపే ప్రయత్నం చేసిన వినిపించుకోలేదు. ఘటన స్థలానికి వచ్చిన కమాన్‌పూర్ పోలీసులతో సైతం సదరు కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితుడు సమ్మయ్య కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్ అజయ్ మరియు అతని బందువు గణేష్ ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సింగరేణి ఉద్యోగి సమ్మయ్య తీవ్ర గాయాలు కాగా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు మద్యం మత్తులో సింగరేణి ఉద్యోగిపై దాడి చేయడం పలు విమర్శకులు దారితీస్తుంది.
Admin
Aakanksha News