Friday, 11 July 2025 05:26:18 AM

ఖైరతాబాద్‌లోని హనుమాన్‌ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన గవర్నర్‌ తమిళిసై...

Date : 20 January 2024 06:20 PM Views : 239

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఖైరతాబాద్‌లోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకున్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేశారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలో ఉన్న అన్ని ఆలయాను శుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హనుమాన్‌ ఆలయంలో స్వచ్ఛ అభియాన్‌ చేపట్టారు.అయోధ్యలో శ్రీరామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ అభ్యర్థించారు. జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 12న మహారాష్ట్రలోని నాసిక్‌లో పర్యటించిన ప్రధాని.. శ్రీ కాలారామ్ ఆలయాన్ని శుభ్రం చేసిన విషయం తెలిసిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :