Saturday, 08 August 2026 05:38:19 AM

CBSE పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న రావుస్ యాజమాన్యం.

రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ పైన చట్టపర్య చర్యలు తీసుకోవాలి. DYFI

Date : 14 March 2023 12:54 PM Views : 1234

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని ప్రశాంత్ నగర్ లోని రావుస్ ఇంటర్నేషనల్ స్కూలుపై శాఖపరమైన చర్యలు తీసుకొని వెంటనే స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఎంఈఓకు ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యను అందిస్తున్నామని పారిశ్రామిక ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా వేళల్లో ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయిలో రావుస్ ఇంటర్నేషనల్ స్కూలుకు CBSE అనుమతులు లేవని అయినా యదేచ్ఛగా CBSE విద్య అందిస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ మోసం చేస్తున్నారని వారు మండిపడ్డారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి తప్పుడు ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న రావుస్ ఇంటర్నేషనల్ స్కూలు పైన కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఈస్టేరియా కన్వీనర్ చంద్రగిరి కృష్ణ కుమార్, కో కన్వీనర్ మొగిలిచర్ల సురేష్ పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :