ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఒక ఏడాది కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడారంగంలో సమూల మార్పులు సాధించామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు.ఈరోజు సికింద్రాబాద్ ఆర్ ఆర్ సి గ్రౌండ్ లో జరిగిన 14వ జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్ షిప్ ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి హాజరైనారుఈ సందర్భంగా ఆయన ట్లాడుతూ, పది సంవత్సరాల నుండి నిర్వీర్యం అయిపోయిన క్రీడారంగానికి జీవసత్వాలు కల్పించే దిశగా ఈ ఏడాది కాలంలో అనేక చర్యలు చేపట్టామని అన్నారు. హైదరాబాద్ ఖ్యాతిని ఇనుమడు ఇంక చేసే విధంగా జాతీయ అంతర్జాతీయ పోటీలకు ఆ తిథ్యం ఇస్తామని ఆయన తెలిపారు. ఒకవైపు మెగా టోర్నమెంట్లు నిర్వహిస్తూనే గ్రామీణ క్రీడాకారులకు చేయూతని అందించేందుకు సీఎం కప్ 20 24 ను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో దాదాపు 11 రోజులపాటు 44 మ్యాచులు నిర్వహణ జరిగింది. ఈరోజు మధ్యప్రదేశ్ ఝార్ఖండ్ రాష్ట్రాల మధ్య జరిగిన ఫైనల్ పోటీలను ఆయన ప్రారంభించి,మ్యాచ్ ను తిలకించారు. ఫైనల్ లో నెగ్గిన జార్ఖండ్జట్టుకు మూడు లక్షల రూపాయల నగదు బహుమతి, రెండో స్థానంలో నిలిచినమధ్యప్రదేశ్ జట్టుకు 2 లక్షల రూపాయల పురస్కారం, మూడో స్థానంలో నిలిచిన మిజోరం జట్టుకు లక్ష రూపాయలు నగదు పురస్కారాన్ని స్పోర్ట్స్ అథారిటీ అందజేసింది. విజేతలకు ట్రోఫీతో పాటు మెడల్స్ ను బహుకరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి,మైనారిటీ విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి, హాకీ ఇండియా సెక్రెటరీ భోలేనాథ్ సింగ్ జి కోశాధికారి శేఖర్ జె.మనోహరన్ సహాయ కార్యదర్శి ఫిరోజ్ అన్సారి సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొండా విజయకుమార్ భీమ్ సింగ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Admin
Aakanksha News