Saturday, 26 September 2026 11:33:47 PM

భర్తను హత్య చేసిన భార్య..

Date : 10 October 2022 11:45 AM Views : 655

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం యుపిహెచ్ కాలనీలో నివాసముంటున్న ఎస్కే అన్వర్ 33 సం,,అనే వ్యక్తి గత కాలంగా కనిపించడం లేదని అతని తల్లి ఎస్.కె రహమత్ ఈ ఏడాది జులై నెలలో ఖమ్మం ఆర్బన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును నమోదు చేసిన ఖమ్మం ఆర్బన్ సిఐ రామకృష్ణ ఆద్వర్యంలో అన్వర్ ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారని ఏసీపీ అంజనేయులు తెలిపారు.కేసు విచారణలో భాగంగా అనుమానితులైన భార్య సల్మా, అత్త సాధుఖాన్, బాలాజీ పై నిఘా పెట్టి వారి కదలికలను పసిగడుతుండగా భార్య సల్మా స్థిర నివాసమైన మహబూబాబాద్ లో ఉంటున్నారని తెలిసి అక్కడి పోలీసు వారి సహాయంతో వారిని పట్టుకోవడం కోసం తిరిగిన ఫలితం లేదు.తర్వాత ఐడి పార్టీ పోలీసుల ద్వారా నిఘా పెంచారు.ఈ క్రమంలో పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని భయపడిన బందువులు సైతం వారికి ఆశ్రమం ఇవ్వ లేదని తెలిపారు.గాలిస్తున్న పోలీసుల నుండి తప్పించుకునే పరిస్థితి లేదని గ్రహించి ఖమ్మం నగరంలో వారికి తెలిసిన పెద్దమనుషుల సహకారంతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన నిందుతులు అన్వర్ భార్య సల్మా, అత్త సాదుఖాన్, బావమరిది యాకూబ్.బాలాజీ, వీరన్న ను విచారించగా అన్వర్ ను మేమే హత్య చేశామని వాస్తవ విషయాలు వెల్లడించారని ఏసీపీ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :