Tuesday, 11 August 2026 05:45:53 PM

అవినీతిపరుల- టూరిస్టుల పాలన మనకు వద్దు..

ఉద్యోగాల పేరుతో మోసం చేసిన నాయకులకు బుద్ధి చెప్పండి.. ప్రజా ఆశీర్వాద యాత్రలో బిజెపి నియోజకవర్గ అభ్యర్థి కందుల సంధ్యారాణి..

Date : 29 October 2023 02:11 PM Views : 1221

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అవినీతిపరుల పరుల- టూరిస్టుల పాలన మనకు వద్దని, ఉద్యోగాల పేరుతో ఎంతో మంది యువకులను మోసం చేసిన నాయకులను ప్రజలు తరిమికొట్టాలని రామగుండం నియోజకవర్గ బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రామగుండం విలేజ్ లోని పాముల పేటలో ప్రజా ఆశీర్వాద యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో సంధ్యారాణికి స్వాగతం పలికారు. దీంతో విలేజ్ రామగుండం తో పాటు పాముల పేట జన సంద్రోహంతో కాషాయమాయంగా మారింది. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ... ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు నియోజకవర్గంలో అభివృద్ధిని మరిచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో ఎంతోమంది యువకులను మోసం చేసిన నాయకులకు ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మనల్ని మనం కాపాడుకోవడానికి ఓటు అనే ఆయుధమే ఏకైక మార్గమని సూచించారు. కమలం పువ్వుకు ఓటేసి గెలిపిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే ప్రజలు నిలదీసే పరిస్థితికి కొంతమంది నాయకులు చేరుకున్నారని ఇకమీదట వారి ఆగడాలకు ప్రజలు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా తనని గెలిపిస్తే ప్రతి ఇంటి ఆడబిడ్డగా.. అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున మహిళలు గ్రామాల నుండి ప్రజలు తరలిరావడంతో వారి ఆప్యాయత అనురాగాలతో భావోద్వేగానికి లోనై సంధ్యారాణి కంటతడి పెట్టారు. అనంతరం గ్రామాల నుండి భారీ ర్యాలీ నిర్వహించి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా తన్ను ఆదరించాలని ప్రజలను కోరారు. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుండి పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరడంతో వారికి పార్టీ కండువాలు కప్పి సంధ్యారాణి బిజెపిలోకి ఆహ్వానించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :