Monday, 10 August 2026 04:07:49 PM

రోడ్డుపై ధాన్యం పోసి రైతుల ఆందోళన...

Date : 03 November 2024 11:53 AM Views : 503

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై ధాన్యం పోసి ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు చేయక కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే సగానికి పైగా ధాన్యం దళారులకు అమ్ముకున్నామని రైతులు తెలిపారు.వెంటనే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రైతులు హెచ్చరించారు. కాగా, రైతుల ఆందోళనతో సిరిసిల్ల- కామారెడ్డి ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :