Monday, 11 May 2026 05:56:02 PM

నామినేషన్ల మొదటిరోజే అక్కడ ఏం జరిగింది అంటే...

Date : 07 October 2022 09:40 PM Views : 561

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : మునుగోడు ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే నామినేషన్ల మొదటి రోజే నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. మునుగోడు మండలం గూడపూర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ.13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గూడపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద పోలీసులు డబ్బును గుర్తించారు. దానికి సంబంధించిన పత్రాలను అతడు చూపించకపోవడంతో అధికారులు ఆ మొత్తాన్ని సీజ్‌చేశారు.ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం అయింది. ఈనెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. అక్టోబర్‌ 15న నామినేషన్ల పరిశీలన, 17న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్‌ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :