ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి మన భూములను గుంజుకుంటున్నాడని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కేసీఆర్ మన బిడ్డలకు సన్న బియ్యంతో భోజనం పెట్టారని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పురుగుల అన్నం పెడుతున్నారని మండిపడ్డారు. ఇది మన భూమి, భుక్తి కోసం జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో దళిత, గిరిజన, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ పాల్గొని ప్రసంగించారు. లగచర్లలో తమ భూముల కోసం పోరాడుతున్న మన బిడ్డలకు మద్దతుగా నిలుద్దామని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. పేద, దళిత, గిరిజన రైతన్నలను అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తే వారి భర్తల కోసం మన ఆడబిడ్డలు పోరాటం చేస్తున్నారని చెప్పారు. వారికి సంఘీభావంగా తెలంగాణ బిడ్డలుగా మనం కూడా చేయి చేయి కలుపుదామని.. పోరాడుదామని అన్నారు.
Admin
Aakanksha News