Saturday, 07 December 2024 01:11:15 PM

2నెలల పాపను గోదావరిలో విసిరేసిన తల్లి...

Date : 23 May 2023 08:52 PM Views : 2417

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాద సంఘటన చోటు చేసుకుంది..2 నెలల పసికందును ఓ తల్లి గోదావరి నదిలో విసిరేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లాకు బొక్య రమేష్ కు, సెంటినరీ కాలనీకి చెందిన ప్రియాంకకు వివాహం జరిగింది. అయితే రమేష్ శ్రీరాంపూర్ లో సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ నాస్పూర్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ముక్కులో నుండి రక్తం కారుతోందని పసికందును గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురాగా పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు నెలల పసికందుతో తల్లి ప్రియాంక ఆటోలో గోదావరి నది వద్దకు వచ్చి పాపను గోదావరి నదిలో విసిరేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే ప్రియాంకను కాపాడి రివర్ పోలీసులకు అప్పగించారు. అప్పటికే గోదావరి నదిలో గల్లంతయిన రెండు నెలల పసికందు కోసం జాలర్లు వెతికిన పసికందును బయటికి తీశారు. అప్పటికే మృతి చెందడంతో పాపను ఆసుపత్రికి తరలించారు దీంతో వారి కుటుంబ సభ్యుల రోధనలు పలువురిని కంటతడి పెట్టించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :