Friday, 25 September 2026 10:41:38 PM

ఎరువుల సరఫరా విషయంలో కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం...

కాంగ్రెస్‌ మిస్‌మేనేజ్‌మెంట్ వల్లే కృత్రిమ కొరత – “రన్ ఆన్ ఫర్టిలైజర్” బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

Date : 20 August 2025 05:33 PM Views : 561

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ఎరువుల సరఫరా విషయంలో కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం చేస్తుందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.“అవసరానికి మించి కేంద్రం యూరియా ఇచ్చినదన్నారు. బుదవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కాంగ్రెస్‌ మిస్‌మేనేజ్‌మెంట్ వల్లే కృత్రిమ కొరత – “రన్ ఆన్ ఫర్టిలైజర్”IFFCO–KRIBHCO–RCF నుంచి 7,250 రేక్స్ యూరియా తెలంగాణకు సరఫరా.కరీకల్ పోర్ట్ దిగుమతుల్లో 10,000 MT ప్రత్యేకంగా తెలంగాణకు కేటాయింపు.ప్రపంచ సమస్యల మధ్య కూడా కేంద్రం వెనుకాడలేదు.రైతుల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయం – రూ.1.40 లక్షల కోట్లు సబ్సిడీ.ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ బీసీలకు అన్యాయం.“మార్వాడీ గో బ్యాక్” నినాదాల వెనుక అర్బన్ నక్సల్స్..తెలంగాణలో ఎరువుల సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. నిజానికి కేంద్రం అవసరానికి మించిన యూరియాను తెలంగాణకు సరఫరా చేసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మిస్‌మేనేజ్‌మెంట్ వల్ల కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. రైతులను భయపెట్టి “రన్ ఆన్ ఫర్టిలైజర్” పరిస్థితిని తీసుకువచ్చింది కాంగ్రెస్సేనని ఆయన స్పష్టం చేశారు. IFFCO, KRIBHCO, RCF నుంచి 7,250 రేక్స్ యూరియా రాష్ట్రానికి వచ్చిందని, కరీకల్ పోర్ట్ దిగుమతులలో 10,000 మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా తెలంగాణకు కేటాయించిందని వివరించారు. ప్రపంచ సమస్యల మధ్య కూడా కేంద్రం వెనుకాడలేదని, రైతుల సంక్షేమమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ధ్యేయమని రాంచందర్ రావు గారు తెలిపారు. మదర్ ఆఫ్ ఆల్ లైస్” అంటే కాంగ్రెస్ పార్టీ.నిజాన్ని కూడా అబద్ధం లా నమ్మించే నైపుణ్యం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఉంది.కేంద్రం యూరియా సరఫరా అంశంపై కాంగ్రెస్ నాయకులు చర్చకు రావాలని.. ఎందుకంటే ఎక్కడా కేంద్రం యూరియా సరఫరా తగ్గించలేదు. కొరతకు కారణాలు వేరే ఉన్నాయి. అందుకే మార్కెట్‌లో కొరత కనిపించిందని నేను గతంలోనే స్పష్టంగా వివరించాను.ఈ విషయంలో చర్చకు నేను గతంలోనే సిద్ధమని సవాల్ విసిరాను. కానీ దానికి సంజాయిషీ చెప్పే ధైర్యం కాంగ్రెస్ నాయకులు చూపలేదు.కేంద్ర ప్రభుత్వం 2025 రబీ సీజన్ (అక్టోబర్ 2024 – మార్చి 2025)లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది.రాష్ట్ర ప్రభుత్వం అమ్మినది 10.43 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగిలింది 2.04 లక్షల టన్నులు ఖరీఫ్ సీజన్ ఓపెనింగ్ స్టాక్‌గా ఉంది.ఈ ఖరీఫ్ సీజన్ (ఆగస్టు 2025 వరకు)లో కావాల్సిన 8.30 లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటివరకు 5.18 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం సరఫరా చేసింది.కాబట్టి ఈ రోజు వరకు మొత్తం అందుబాటులో ఉన్న యూరియా – 7.22 లక్షల మెట్రిక్ టన్నులు.అసలు సమస్య – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ముందుగానే “స్టాక్ లేదు” అని అబద్ధాలు చెప్పడం. ఇది మిస్ మేనేజ్‌మెంట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్.ఈ భయంతో రైతులు ఒక్కసారిగా షాపులకు చేరుకోవడం, దళారులు బ్లాక్ మార్కెట్ కొనుగోలు చేయడం వలన కృత్రిమ కొరత ఏర్పడింది.దీన్నే “రన్ ఆన్ ఫర్టిలైజర్” అంటాం. బ్యాంకులపై వదంతులతో ప్రజలు డబ్బులు వాపస్ తీసుకున్నప్పుడు బ్యాంకులు దివాళా తీయడం లాగే ఇప్పుడు తెలంగాణలో “రన్ ఆన్ ఫర్టిలైజర్” నడుస్తున్నది.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నేతృత్వం వహిస్తున్న సొంత జిల్లాలో గత ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో అదనంగా 3,200 టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ఏడాది పంట విస్తీర్ణంలో గత సంవత్సరంతో పోల్చితే ఏ మార్పూ లేదు. మరి ఇంత అదనపు యూరియా ఎక్కడికి వెళ్ళింది? నిజంగా రైతుల చేతికి చేరిందా, లేక బ్లాక్ మార్కెట్ మాఫియా చేతికి చేరుతోందా? దీనిపై మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలని rama చంద్రా రావు డిమాండ్ చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :