ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ లో రెడ్ క్రాస్ భవన్ హాలులో జరిగిన వినియోగదారుల సమైక్య రాష్ట్ర సదస్సు లో జాతీయ సి. సి. ఐ చీఫ్ పాటర్న్ డాక్టర్ అనంతశర్మ సీసీఐ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం ను ప్రాతిపదికగా తీసుకొని,శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సీసీఐ నూతన అధ్యక్షులుగా మామిడి భీమ్ రెడ్డి ఎంపికైనట్టు అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు. మామిడి భీమ్ రెడ్డి పింజర్ల గ్రామం, కొత్తూరు మండలం, రంగా రెడ్డి జిల్లాకు చెందినవారు. వీరు గతంలో సేవా కార్యక్రమాలలో 2019- 20 సంవత్సరానికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడలను అందుకున్నారు. అంతేకాకుండా గవర్నర్ చేతుల మీదుగా 16 గోల్డ్ మెడల్స్ మరియు 18 సేవా అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ జిల్లా చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా మందులు పంపిణీ మరియు ఆపదలో రక్తం అవసరం అయిన సందర్భాలలో ఎంతో మందికి ఆపదలో చేయూతనందించారు. దీంతోపాటు ప్రధానమంత్రి టీవీ ముక్త్ భారత్ అభియాన్ పథకంలో పేదలకు ఆరు నెలల పాటు ఉచితంగా న్యూట్రిషనల్ ఫుడ్ బాస్కెట్ కిట్లను అందించడంలో సహకారం అందించారు. అలాగే మాసబ్ ట్యాంక్ లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ మెడికల్ షాపు ను త్వరలో ప్రారంభించి పేదల కు తక్కువ ధరలో మందులు అందించనున్నారు. రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ కార్యాలయంలో బ్లడ్ సెంటర్ ను ఏర్పాటు చేసి తల సేమియా పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు, అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాలతో గాయపడిన వారికి రక్తం అందించనున్నారు. ఇప్పటివరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసిన భీమ్ రెడ్డి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ, ఇప్పటినుంచి వినియోగదారుల సంక్షేమం కోసం వారి యొక్క హక్కులను సంరక్షించడం కొరకు రాష్ట్రం మొత్తం మీద 33 జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసి వందరోజుల కార్యాచరణను నిర్దేశించుకుని రాష్ట్రమంతా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. నా మీద నమ్మకం, భరోసాతో రాష్ట్ర బాధ్యతలు అప్పగించి తెలంగాణ రాష్ట్ర సిసిఐ అధ్యక్షుడిగా నియమించిన జాతీయ చిప్ పాటర్న్ డాక్టర్ అనంత శర్మకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటుగా నేషనల్ సిసిఐ ప్రెసిడెంట్ ప్రీతి పాండ్యాకి, ఉప అధ్యక్షులు అరుణ్ కుమార్ కి, సెల్వ రాజు కి, చదలవాడ హరిబాబు కి, నేషనల్ సెక్రటరీ శంకర్ లాల్ చౌరాసి కి, శివపార్వతి కి ధన్యవాదాలు తెలిపారు.
Admin
Aakanksha News