Friday, 25 September 2026 06:44:40 PM

గ్రూప్ 1కు పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

ఈ నెల 21 నుంచి యథావిధిగా పరీక్షలు...

Date : 15 October 2024 07:00 PM Views : 399

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1కు పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి యథావిధిగా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. కాగా, సోమవారం నుంచి ఆన్ లైన్ లో హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.మెయిన్స్‌కు మొత్తం 31,382 మంది అర్హత సాధించారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ సహా మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఇంగ్లిష్‌ తప్ప అన్ని పేపర్లను తె లుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో రాయవచ్చు. ఈనెల 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 563 గ్రూప్‌ 1 ఖాళీల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :