ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : జిడికే 11ఏ ఇంక్లైన్ గనిపై ఈనెల 18,19 తేదీలలో జరిగే పెద్దపల్లి జిల్లా ఐ ఎఫ్ టీ యు మహాసభల పోస్టర్స్ ను TGLBKS (IFTU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచుపెడుతున్నాయని విమర్శించారు. ఈ విధానాలు బిజెపి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రమై 44 కార్మిక చట్టాల్ని మార్చి నాలుగు కోడ్స్ గా తీసుకువచ్చి కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు తమ ప్రభుత్వాలు అండగా ఉంటాయని రుజువు చేసుకున్నాయని అన్నారు. దేశంలో హిందూ ఫాసిజం మాట్లాడే స్వేచ్ఛపై ప్రజా ఉద్యమాలపై తీవ్రమైనటువంటి అణిచివేత ప్రారంభించిందని అన్నారు. మార్చి 18,19 తేదీలలో జరుగు ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా మహాసభల సందర్భంగా జరుగు కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో వేలాదిమందిగా పాల్గొనాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సమావేశంలో TGLBKS (IFTU ) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్, ఎం కొమురయ్య, పి మొండయ్య, చింతల శేఖర్, కే మొగిలి, ఎన్ సి బాబు. తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News