Friday, 25 September 2026 09:53:41 PM

కుల మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుదాం...

విద్యార్థి ఉద్యమ జాతీయ నాయకులు జూపాక శ్రీనివాస్ పిలుపు

Date : 17 January 2024 03:46 PM Views : 588

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కుల మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుదామని నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, క్రాంతి కుమార్, పులిపాక రాజ్ కుమార్ లు అన్నారు. గోదావరిఖని స్థానిక ప్రధాన చౌరస్తాలో CPI ML ప్రజాపంధా, PDSU తెలంగాణ సామాజిక ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, IFTU ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ స్కాలర్ వేముల రోహిత్ 8వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యూనివర్సిటీ స్థాయిలోనే కుల వివక్షత ఎదుర్కొంటూ మనువాద చేతులలో ఆత్మహత్యకు గురై 8 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ కులం, మతం పేరుతో రాజకీయ నాయకులు ప్రజలను విభజిస్తూ ఓట్లు ఆడుక్కుంటున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అయితే అయోధ్య రామ మందిరం పేరుతో మరింత మతోన్మాదాన్ని గడప గడపకు పంపించే విధంగా అక్షంతలు ఇంటింటికి పంపుతూ ప్రజల మధ్య తీవ్ర వివక్షతలు చూపిస్తున్నారని ఆరోపించారు. విద్యా వ్యవస్థలో కూడా నూతన విద్యా విధానం పేరుతో కార్పొరేట్, ప్రైవేటు విదేశీ యూనివర్సిటీలు మన దేశంలో కొచ్చే విధంగా కార్పొరేట్ వ్యవస్థకు స్వాగతం పలుకుతున్నారన్నారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థకు బడ్జెట్ కేటాయించకుండా యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు విసి పోస్టులు భర్తీ చేయకుండా కనీసం బడ్జెట్ కూడా కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే పేద వర్గాలు దేశవ్యాప్తంగా ఆరు శాతం మాత్రమే ఉన్నత విద్యకు వస్తుంటే ఈ విద్యార్థులను కూడా ఉన్నంత విద్యకు దూరం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు.ఇప్పటికైనా కుల మత రాజకీయాలపైన ప్రజాస్వామ్యవాదులు విద్యార్థి యువజన సంఘాలు ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపందా జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, వేముల లక్ష్మణ్, గుండ్ల మల్లికార్జున్, సనవాజ్ సల్మాన్ పాల్గోన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :