ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం మెడికల్ కళాశాలలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపి కళాశాల ప్రిన్సిపాల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ లోని DME కి రామగుండం నగరపాలక సంస్థ 25వ డివిజన్ కార్పొరేటర్ భర్త నగునూరి సుమలత. రాజు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గోదావరిఖని మెడికల్ కళశాల ప్రిన్సిపల్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పిర్యాదులో పేర్కొన్నారు.ఎలాంటి ప్రోటోకాల్ పాటించడం లేదని తెలిపారు. ఉద్యోగాల అమ్మకాలు, ప్రభుత్వ ఆస్పత్రిపై పెత్తనం కొనసాగిస్తున్న ప్రిన్సిపల్ పై విచారణ చేసి తగు చర్యలు తీసుకొవాలని ఆయన కోరారు. రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పెత్తనం కొనసాగిస్తూ ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల, ప్రజల పట్ల కొంత మంది సిబ్బంది పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతు తన సొంత మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆస్పత్రి తమేదే ఆన్నట్లుగా పెత్తనం కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆస్పత్రిలో ఎవరైనా రోగులను చూడటానికి వస్తే తమ అనుచరులతో దాడులు కూడా చేయిస్తున్నారని ఆరోపించారు. ఇక ఆస్పత్రులలో మెడికల్ కాలేజ్ లో ప్రైవేట్ ఉద్యోగాల విషయంలో తమ అనుచరులను ఏర్పచుకొని అమ్ముకుంటున్నారని ఈ విషయం మీ దృష్టికి తీసుకురావడం జరగుతుందని లేఖలో పేర్కొన్నారు.నిరంతరం హైదరాబాద్ లోనే ఉంటు ఇక్కడ ఆస్పత్రి మెడికల్ కాలేజ్ ను నడిపిస్తూ ఆర్థిక వనరులను ఏర్పచుకోని, మెడిసిన్స్ కొనుగోలు లో కూడా అనేక అవకతవకలు జరిగాయని కావున మెడికల్ కాలేజీ విద్యార్థులను ఏ రోజు కూడా వారి బాగోగులు చూడకుండా వారి గురించి పట్టించుకోకుండా ఉండడం వల్లనే గత వారం రోజుల క్రిందట ర్యాగింగ్ జరిగిందన్నారు.అదే విధంగా మెడికల్ కాలేజ్ అనుబందంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో 80 ICU బెడ్లను ప్రారంభించారు?. ప్రిన్సిపల్ కి ప్రోటోకాల్ తెలియదా? ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై విజిలెన్స్ విచారణ చేయాలని అనంతరం బదిలి చేయాలని పిర్యాదులో తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ ఆస్పత్రి 25వ డివిజన్ లోకి వస్తుందని కనీసం ఏ ప్రభుత్వ కార్యక్రమం అయిన మాకు సమాచారం ఇవ్వరని ఇతర ప్రజా ప్రతినిధులను తమకు అనుకులంగా ఉండే నాయకులను పిలిపించుకుంటారని అన్నారు. కావున ప్రిన్సిపల్ పై తగు చర్యలు తీసుకోవాలని 25వ డివిజన్ కార్పొరేటర్ పిర్యాదులో DME ని కోరారు.
Admin
Aakanksha News