Tuesday, 11 August 2026 10:48:52 PM

భావితరాలకు తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను అందించాలి.

గోలివాడ సర్పంచ్ ధరణి రాజేష్.

Date : 29 May 2023 10:10 AM Views : 681

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గ్రామ సంస్కృతిక సంప్రదాయ పద్ధతిలో బోనాలు జాతర నిర్వహించుకోవడం గ్రామ కీర్తి ప్రతిష్టలు పెంపొందిస్తుందని సర్పంచ్ ధరణి రాజేష్ అన్నారు. అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో గ్రామ దేవత పోచమ్మ తల్లి, భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ఎదురు కొలుపు బోనాల జాతర అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామ మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను నెత్తిన ఎత్తుకొని అమ్మవారి ఆలయం వరకు డప్పు చప్పుళ్ళు, వాయిద్యాలు, శివశక్తుల పూనకాలు ,నృత్యాలు కోలాహలంగా గ్రామంలోని అన్ని వీధుల గుండా ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధరణి రాజేష్, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తూ భావితరాలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, సర్పంచ్ ధరణి రాజేష్, ఉప సర్పంచ్ కస్తూరి పద్మ, హనుమాన్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఆవుల గోపాల్ యాదవ్, గోపాల్ రెడ్డి, గిట్ల శంకర్ రెడ్డి, అవుల చంద్రయ్య, ధరణీ సత్తయ్య, శ్రీనివాస్ రెడ్డి, ధరణి నరేందర్, అలిశెట్టి రవి, వార్డు సభ్యులు, తదితరులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :