ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని లయన్స్ భవన్ లో ఉచిత కంటి పరీక్షలు,షుగర్ పరీక్షలు నిర్వహించేందుకు విజన్ సెంటర్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కే రాజేందర్, సెక్రటరీ పి మల్లికార్జున్, ట్రెజరర్ వి ఎల్లప్ప ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ లు మీనేష్ నారాయణ్ టండన్, ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హజరై మాట్లాడుతూ..ఈరోజు ప్రారంభించిన విజన్ సెంటర్లలో ఉచిత కంటి వైద్య పరీక్షలు, షుగర్ పరీక్షలు నిర్వహిస్తామని అవసరం అయిన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేపిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సహకరించిన దాతలు లయన్ రాజేశ్వర్ రావు, రమాపతిరావులను అభినందించారు. లైన్స్ క్లబ్ రామగుండం ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా సుమారు 900 మందికి ఉచిత కృత్రిమ అవయవాలు పంపిణీ చేశామని, పేదవారికి పారిశ్రామిక ప్రాంతంలో పలు కేంద్రాల్లో ఉచిత అన్నదానము, తక్కువ ధరకే శుద్ధమైన మంచినీటిని పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందుకు ప్రస్తుత కార్యవర్గ కమిటీని అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, బంక రామస్వామి, గుగ్గిళ్ళ రవీంద్ర చారి, తానిపర్తి గోపాల్ రావు, డి లక్ష్మారెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, బేణి గోపాల్ త్రివేది, మనోజ్ కుమార్ అగర్వాల్, లక్కం బిక్షపతి, ముడతనపల్లి సారయ్య, బూర్ల రమణయ్య తదితరులు పాల్గోన్నారు.
Admin
Aakanksha News