ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ల్యాబ్ లో ఉపయోగించే కెమికల్ రిఏజెంట్ల కొనుగోలుపై విచారణ జరపాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ... ఆసుపత్రి ల్యాబ్ లో వాడే కెమికల్ రిఏజెంట్ల ను మెడికల్ కళాశాల ముఖ్య అధికారి కొంత మంది మెడికల్ కళాశాల ప్రొఫెసర్లతో కలిసి 30 లక్షల రూపాయల కెమికల్స్ కొనుగోలు చేశారని, ఆ కొనుగోలులో అవకతవకలు జరిగాయని సూర్య ఆరోపించారు. 30 లక్షల విలువచేసే కెమికల్స్ కొనుగోలుకు టెండర్ పిలవాల్సి ఉండగా ఎలాంటి టెండర్ లేకుండా కొంతమంది ప్రొఫెసర్లు వ్యతిరేకించిన తనకు అనుకూలంగా ఉన్న ప్రొఫెసర్ల చేత సంతకాలు తీసుకొని ఈ కొనుగోలు పూర్తి చేయడం వెనక ఖచ్చితంగా అవినీతి జరిగిందని పూర్తిస్థాయిలో దీనిపై విచారణ చేస్తే లోపాలు బయటపడతాయని ఆయన అన్నారు.నిబంధనలను అతిక్రమించి అవినీతినికి పాల్పడడం కాక ఈ వివరాలను ఆన్ లైన్ లో ఎంటర్ చెయ్యాలని ఒక ఉద్యోగిని ఇబ్బంది పెడితే అతను అనారోగ్యానికి గురై లీవ్ లో ఉన్నాడనీ అన్నారు. కెమికల్ రిఏజెంట్ల కొనుగోలుకు సంబంధించిన ఆర్డర్ కాపీలు మరియు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్న మినిట్ బుక్ పూర్తి వివరాలు బహిరంగపరచాలని మెడికల్ కళాశాల ఉన్నతాధికారులను సూర్య డిమాండ్ చేశారు .గత సంవత్సర కాలంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషంట్ల సంఖ్య వారికి జరిగిన లాబ్ టెస్ట్ ల సంఖ్యతో పాటు గత సంవత్సరం వాడిన రిఏజెంట్ల పై ఒక శ్వేత పత్రం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను కోరారు. ఈ అవినీతి పై AIYF గా జిల్లా కలెక్టర్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులను కలుస్తాం అని అన్నారు. వారు స్పందించి ఈ కొనుగోలు పై పూర్తి విచారణా జరుపాలని సూర్య కోరారు
Admin
Aakanksha News