ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : ప్రధాని నరేంద్ర మోడీకి జేబు సంస్థలుగా ఈడీ, ఏటీఎం కార్డుగా కార్పొరేట్ కంపెనీలు మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ ప్రభుత్వం నరేందర్ మోడీ వెంటాడి తమ చేతుల్లో ఉన్న నిఘా సంస్థలను ఉసిగొలిపి అనేక దాడులు, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేసులు పెట్టి జైలకు పంపుతున్నారని పేర్కొన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షగట్టి, గవర్నర్ల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు సాగకుండా అడ్డుపడుతూ ఆటంక పరుస్తున్నారని అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్న మతోన్మాద చర్యలను వ్యతిరేకించిన రచయితలపై, ప్రజాస్వామిక వాదులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని విమర్శించారు. ఇండియా కూటమిని పూర్తిగా బలహీన పరచాలని ఉద్దేశంలో భాగంగా రకరకాల ఎత్తులు,జిత్తులు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు అవసరం లేని విధానాలను తీసుకువచ్చి బలవంతంగా రుద్దుతుందన్నారు. సీఐఏ తీసుకొచ్చి ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు.ముఖ్యంగా రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు, హద్దు పద్దు లేకుండా అధిక ధరలు పెంచుతూ దేశాన్ని అప్పుల పాలు చేస్తుందన్నారు. ప్రజల ఆస్తులను అమ్మటం, ప్రజల సంపద మొత్తం ధ్వంసం చేస్తూ కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందన్నారు. మతం పేరుతో, రాముడి పేరుతో రాక్షస రాజ్యం నడిపిస్తుందన్నారు. దేశంలో మరోసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి వేస్తామని బిజెపి నాయకులు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రకటించిన బిజెపి రానున్న ఎన్నికల్లో ఓడించాలన్నారు. భవనగిరి పార్లమెంట్ నుండిసిపిఎం పోటి చేస్తుందన్నారు. మిగతా స్థానాల విషయంలోఆలోచించి తగు నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితి నెలకొని ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టి ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమేకరువు మండలాలు ప్రకటించి కరువు సహాయం చేయాలన్నారు. రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పల్లి సైదు లు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి పాల్గొన్నారు.
Admin
Aakanksha News