ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ కౌన్సిల్.. వి ఏ సి సి రాష్ట్ర అధ్యక్షుడిగా గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజికవేత్త వేల్పుల మురళీధర్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కౌన్సిల్ చైర్మన్ డా. రాజలింగు మోతె, అడ్వకేట్ ఓక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను రామకృష్ణాపూర్ పట్టణంలోని కౌన్సిల్ కార్యాలయంలో శనివారం అందజేశారు. కౌన్సిల్ బలోపేతానికి నిబద్ధతతో పనిచేయాలని, అవినీతిని, సాంఘిక దురాచారాలను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. పోలీస్, ప్రెస్ మీడియా సమన్వయంతో నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.
Admin
Aakanksha News