Thursday, 24 September 2026 03:36:34 PM

మంత్రి కేటీఆర్ వద్దకు రామగుండం పంచాయతీ...

Date : 20 July 2023 08:15 AM Views : 1443

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : రామగుండం రాజకీయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్న కన్నాల సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి, పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి, రామగుండం నగరపాలక సంస్థ తొలి మాజీ మేయర్ కోంక్కటి లక్ష్మీనారాయణ, తెలంగాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పాతిపెల్లి ఎల్లయ్య లతో కలసి సమావేశం నిర్వహించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ దాదాపు రెండు పాటు సుదీర్ఘ చర్చ నడిపినట్లు తెలుస్తుంది. అయితే ఆశావాహులతో మాట్లాడిన అనంతరం వారి నుంచి సేకరించిన సమాచారాన్ని మంత్రి కేటీఆర్ కు ఫోన్ లో వివరించినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ ఆశావాహులను హైదరాబాద్ ప్రగతి భవన్ కు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి కేటీఆర్ తో సమావేశం కావడానికి ఆశావాహులు హైదరాబాద్ కు చేరుకోవడంతో రామగుండం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కేటీఆర్ తో సమావేశం అనంతరం రామగుండం రాజకీయాలు ఎటు వైపు మలుపు తిరుగుతాయో అనే సందేహాలు నెలకొంటున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :