ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : సీపీఎం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని గ్రామ కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో బుధవారం సిపిఎం పార్టీ జిల్లా మహా సభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు... మొట్ట మొదటి సారిగా మన అచ్చంపేట లో ఈ నెల 14 15 తేదీలలో జరిగే మహా సభలను జయప్రదం చేయాలన్నారు. నిరంతరం ప్రజా పోరాటాలే బాధ్యతగా నిర్వహించే పార్టీ ఒక్క కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకెళ్తున్న సీపీఎం పార్టీ మహాసభలకు ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, బంగారయ్య, సైదులు బాలయ్య, శ్రీను తదితరులు ఉన్నారు.
Admin
Aakanksha News