ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : గోదావరిఖని మార్కండేయ కాలనీ లోని నారాయణ పాఠశాలలో బుధవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణ విద్యాసంస్థల ఏజిఎం చైతన్య రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రీ ప్రైమరీ పూర్తి చేసుకుని మొదటి తరగతిలోకి, ఐదవ తరగతి పూర్తి చేసుకుని 6వ తరగతి లోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. పాఠశాల స్థాపించిన సమయం నుండి ఇప్పటివరకు పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన పోషకులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సహకారం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల ఆట పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాలల కో-ఆర్డినేటర్స్ శ్రావణి, రవళి ప్రియ, పాఠశాల డిన్ జి వెంకటస్వామి, ఏవో సంజీవ్, ఈ ఛామ్స్ వైస్ ప్రిన్సిపల్ సౌభాగ్య, ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ రమాదేవి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News