Tuesday, 11 August 2026 03:43:30 PM

బీఆర్ఎస్ బంది పోటుల రాష్ట్ర సమితి...

మూడేళ్లకే మునిగిపోయిన కాలేశ్వరం ప్రాజెక్ట్...

Date : 10 November 2022 08:10 PM Views : 454

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర 205వ రోజులో భాగంగా లో ఇందారం మీదుగా గోదావరిఖనికి చేరుకుంది. మొదటగా గోదావరి బ్రిడ్జి మీద వైయస్సార్ టిపి నాయకులు కార్యకర్తలు మహిళలు జననీరాజనాల మధ్య ఘన స్వాగతం పలికారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు సాగిన ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీశారు. సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... దళిత బంధు వారి అనుచరుల బంద్ గా మారిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లి శాషిస్తానని ఢిల్లీలో తిరుగుతున్నాడని ఆరోపించారు. ఇక ఇండిపెండెంట్ గా గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భూ కబ్జాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నాయని, అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానని చెప్పి తన సొంత అభివృద్ధి చూసుకుంటున్నాడని ఎమ్మెల్యే పై మండిపడ్డారు. అంతే కాకుండా రామగుండం ఎరువుల కర్మాగారంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడని స్థానిక ఎమ్మెల్యే పై చర్యలు తీసుకునే దమ్ము లేదా అని ప్రశ్నించారు. ఇలా ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి వెళ్లే వారిని రాజకీయ వ్యభిచారులు అంటారని ఘాటుగా విమర్శించారు. వరి వేసుకుంటే ఊరి అన్న సన్యాసి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరోపించారు. అలాగే సింగరేణిలో ఒకేసారి ఈ యొక్క కాలంలో ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి కే దక్కిందన్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీ బందిపోటుల రాష్ట్ర సమితిగా మారిందని విమర్శించారు. రైతులకు సాగు తాగునీరు అందిస్తానని కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే మునిగిపోయిందని వైయస్ షర్మిల అన్నారు. ప్రధానమంత్రి వస్తే ఎదురుగా వెళ్లి సమస్యలను తెలపాల్సిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లిలా దాక్కుంటున్నారని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :