Saturday, 18 January 2025 10:21:23 AM

ప్రమాదం అంచున పక్షుల ప్రపంచం....

గెజిటెడ్ హెడ్మాస్టర్ & పర్యావరణ నిపుణుడు డాక్టర్ భారత రవీందర్

Date : 08 January 2025 07:29 PM Views : 144

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ప్రకృతి యొక్క అత్యంత అందమైన ఆకర్షణీయమైన జీవులలో పక్షులు ఒకటి . ఇవి రెండు కాళ్ళు రెండురెక్కలు కలిగి ఉండి శరీరమంతా ఈకలతో నిండి ఉన్న అండోత్పాదక మరియు ఉష్ణ రక్త విహంగ జీవులు . పూర్వ కాలంనాటి పురాణాలు కావ్యాలు , జానపదకథలలో పక్షులు ప్రధాన పాత్ర పోషించినట్లు మన హిందూపురాణ గాధలు చెబుతున్నాయి . విష్ణువుకు గరుడపక్షి సరస్వతికి హంస కార్తికేయునికి నెమలి ( ప్రస్తుతం జాతీయ పక్షి ) వాహనాలుగా ఉన్నాయి . మహాభారత యుద్దంలో గరుడపక్షి అర్జునుడి విజయానికి తోడ్పడింది . క్రౌoచపక్షి దంపతుల వియోగం శ్రీమద్రామాయణం అవతరణకు కారణమైంది . జటాయువు పక్షి రామునికి సాయం చేసినట్లు రామాయణం చెబుతోంది . పూర్వం రాజులకాలంలో పావురాలు వార్తాహరులుగా ఉపయోగపడేవి . నాటి నుండి కూడా మానవ కర్మకాండల విశ్వాసాలలో కాకుల పాత్ర గణనీయమైంది . ప్రస్తుతం పక్షులు జీవశాస్త్రం మరియు మానసిక శాస్త్ర ప్రయోగాలలో ఉపయోగపడుతున్నాయి . నేటి ఆధునిక జంతు శిలాజ శాస్త్ర నిదర్శనాల ప్రకారం పక్షులు సుమారు 15 కోట్ల సంవత్సరాల పూర్వం జురాసిక్ యుగం లో థీరోపోడ్ లు అనే డైనోసార్ల నుండి పరిణామం చెందినాయని జీవశాస్త్ర చరిత్ర చెబుతోంది . భూమిపై మానవ మనుగడకు అత్యంత అవసరమైన పక్షులు వేగంగా అంతరించిపోతున్న కారణంగా వాటి ఉనికిని తిరిగి నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో అమెరికాలోని ఏవియన్ వెల్ఫేర్ కోహిలిషన్ సంస్థ అధ్వర్యంలో 2002 లో మొట్టమొదట జాతీయ పక్షి దినోత్సవం నిర్వహించబడింది . మన దేశంలో ప్రతి ఏట ప్రపంచ ప్రఖ్యాత భారతీయ పక్షి ప్రేమికుడు , బర్డ్ మ్యాన్ అఫ్ ఇండియా గా ప్రసిద్ది చెందిన డాక్టర్ సలీం అలీ జన్మదినమైన జనవరి 5 న జాతీయ పక్షుల దినోత్సవం ( నేషనల్ బర్డ్ డే ) జరుపుకుంటున్నాము . గత సంవత్సరం ఫైట్ ఫర్ ఫ్లైట్ అనే ఇతివృత్తంతో జరుపుకున్నాము . ఈ యేడు “ పక్షుల సంరక్షణ పై ప్రజలకు అవగాహనను పెంచడం “ అనే థీమ్ తో నిర్వహించుకుంటున్నాము . ఈ రోజు పక్షుల సంరక్షణ మనుగడ పర్యావరణ సమస్యలపై దృష్టి సారించబడుతుంది . ప్రమాదపు ముప్పులో పక్షులు : సాధారణంగా పక్షులను భూగ్రహం యొక్క ఆరోగ్యానికి బారోమీటర్ గా సూచిస్తారు . పక్షులు విత్తనవ్యాప్తిలో పరాగసంపర్కకారకాలుగా సహజ పారిశుద్ధకార్మికులుగా పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ఇవి కీలకపాత్రను పోషిస్తాయి . ప్రకృతిలో కాకి గద్ద రాబందు లను “ ప్రకృతి యొక్క డస్ట్ బిన్ బాయ్స్ “ అని అంటారు . పంటలను ఆశించే కీటకాలను తిని పక్షులు పంటలను రక్షించి రైతు మిత్రులుగా పేరొందినాయి .పక్షులు పర్యావరణ వ్యవస్థలో అసమాన ప్రభావాన్ని చూపే కీ –స్టోన్ జాతులు . ఇవి ఆహారపు గొలుసు , ఆహారపు జాలకం లో భాగమై స్థానిక అవాసాలు అవరణవ్యవస్థ ( ఎకోసిస్టం ) నిర్మాణంలో ప్రధానపాత్ర వహిస్తాయి . పక్షుల మలం ద్వార పడిన గింజలు అడవుల్లో కొత్త మొక్కలుగా ఎదుగుతాయి . పక్షులు మానవునికి ముఖ్య ఆహారంగా ఉపయోగపడుతాయి . కావున వీటిని పర్యావరణ ఇంజనీర్లు అంటారు . వీటి పెంపకం సంరక్షణ మరియు వీక్షణం ( బర్డ్ వాచింగ్ ) బర్డ్ ఫోటోగ్రఫి వల్ల ద్రవ్యలాభము , వినోదం , మాసిక ఉల్లాసం బర్డ్ ఎకోటూరిజం అభివృద్ధిలతో పాటు ప్రజల్లో ఆనందం ప్రేమ ఆప్యాయత అనురాగం దయ పరోపకారం ఐక్యత అను మానవ విలువలు పెంపొందుతాయి . ప్రకృతి పట్ల గౌరవభావం పెరుగుతుంది . పర్యావరణ వ్యవస్థల దుర్భలత్వం మరియు పక్షుల ప్రమాదపరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది . ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10906 పక్షి జాతులుండగా మన దేశంలో 1,353 జాతులున్నట్లు జియాలాజికల్ సర్వె ఆఫ్ ఇండియా తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి . ఈ ప్రకారం ప్రపంచంలోని పక్షి జాతులలో 12 శాతం జాతులు భారత్ లో ఉన్నవి . ఇక మరే దేశంలోను కనిపించని 78 రకాల పక్షిజాతులు మన దేశంలో మాత్రమే కనిపిస్తాయి . వీటిలో 25 శాతం మనుగడప్రమాదంలో ఉన్నాయని మనదేశానికి వచ్చే విదేశీ వలస పక్షి జాతుల్లో 29 జాతులు ప్రమాదం అంచులో ఉన్నట్లు , 15 జాతులు దాదాపు అంతరించే దశలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి . మన దేశంలో బట్టమేకల పక్షి అంతరించిపోయే స్థితిలో ఉందని ప్రస్తుతం 150 పక్షులు మాత్రమే ఉన్నాయని హై వోల్టేజ్ విద్యుత్ తీగలు వీటికి ప్రాణాంతకంగా మారినాయని కేంద్ర పర్యావరణ శాఖ ఇటివల పేర్కొంది . ప్రతి 8 పక్షుల జాతులలో ఒకటి అంతరించి పోయే దశలో ఉన్నాయని స్టేట్ అఫ్ ది వరల్డ్ 2022 -23 నివేదిక పేర్కొంది . మన దేశంలో గ్రేట్ఇండియన్ బస్టర్డ్ , రెడ్ హెడ్ రాబందు ,అడవిగుడ్లగూబ ,బిల్డ్ సాండ్ పైపెర్ , జెర్డాన్ కోర్సర్ ,బెంగాల్ ఫ్లోరికన్ , వైట్ బెల్లీ హెరాన్ , హిమాలయ పిట్ట ల్యాప్ వింగ్ పక్షి , సైబీరియన్ క్రేన్ , ఎల్లో బ్రెస్ట్ బంటింగ్ పక్షులు అంతరించే దశలో ఉన్నాయని రెడ్ డేటా బుక్ గణాంకాలు తెలుపుతున్నాయి . వచ్చే శతాబ్దంలో 1200 జాతులు అంతరించి పోయే ప్రమాదం ఉన్నట్లు , 200 జాతులు ఇప్పటికే అంతరించి పోయినట్లు వరల్డ్ వాచ్ సంస్థ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం . అసాధారణ వాతావరణ మార్పులు భూతాపం జనాభా విస్పోటనం , తరుగుతున్నఅడవులు కార్చిచ్చులు ఆహారం నీటి కొరతలు తీవ్ర రేడియేషన్ ప్రభావం , అయస్కాంత ప్రభావం విపరీతమైన ద్వని , గాలి నీటి కాలుష్యం , మిరుమిట్లు గొలిపే కాంతి పురుగుమందులు మరియు ఎరువుల అధిక వినియోగం ,పక్షుల వేట అను అంశాలు పక్షుల అంతానికి కారణమవుతున్నాయి . జీవనగమనంను నేర్పే పక్షులను కాపాడటం మానవుని కర్తవ్యం అని చెప్పిన భారత పక్షిశాస్త్ర పితామహుడు సలీంఅలీ మాటలు ఎంతో స్పూర్తిదాయకమైనవి . సలీంఅలీ కృషి స్పూర్తిదాయకం : గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ ( పురాతన భారతీయ పక్షి మానవుడు ) గా పేరు గాంచిన డాక్టర్ సలీం అలీ మన దేశంలో క్రమబద్దమైన శాస్త్రీయమైన పక్షుల సర్వేలను నిర్వహించిన మొట్టమొదటి భారతీయులలలో ఒకరు . ది బుక్ అఫ్ ఇండియన్ బర్డ్స్ పుస్తకంను రచించిన మహారాష్ట్రకు చెందిన ఆయన పక్షుల సంరక్షణ కొరకు జీవితాంతం పనిచేసాడు . మన దేశంలో భరత్ పూర్ పక్షుల అభయారణ్యం ఏర్పాటులో మరియు సైలెంట్ వ్యాలి నేషనల్ పార్క్ ను నాశనం చేయకుండా నిరోదించడంలో ముఖ్యపాత్ర పోషించాడు . అయన స్పూర్తిగా ఈనాడు ప్రజలు పాలకులు పక్షుల సంరక్షణకు పాటుపడవల్సిన అవసరం ఉంది . నేడు అవాసాల నష్టం మరియు విధ్వంసం వాతావరణ మార్పులు అనేవి పక్షులు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉన్నాయి . కనుక పక్షుల సంరక్షణకు పక్షినిపుణులు పలు పద్దతులు అభివృద్ధి చేశారు . పక్షుల జాతులను సంరక్షించడానికి క్యాప్టివ్ బ్రీడింగ్ పాపులేషన్ పద్ధతి అనుసరించి అంతరించి పోతున్న జాతులను తిరిగి నింపడానికి , కొత్త జనాభాను సృష్టించడానికి , అంతరించి పోతున్న ఒక జాతిని పునరుద్దరించడానికి ఉపయోగపడుతుంది . వలస పక్షుల మార్గాలను కాలనుగుణతను తెలుసుకోవడానికి అగ్మెంటేడ్ రియాలిటి సాంకేతికతను వినియోగించాలి . అంతరించి పోతున్న జాతుల డేటా ను సేకరించడానికి జిపిఎస్ ట్రాకింగ్

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు