Saturday, 26 September 2026 08:08:57 AM

గుండెను కోసి ప్రియురాలికి గిఫ్టుగా పంపించిన యువకుడు

యువకుడు పంపిన ఫోటోలకు వెరీ గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చిన యువతీ

Date : 25 February 2023 02:17 PM Views : 535

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : టీనేజ్ లో ప్రేమ అడ్డదారులు తొక్కుతుంది.. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి కొందరు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉండగా మరికొందరు కటకటాల పాలవుతున్నారని అనడానికి ఈ సంఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు. తన ప్రేయసిని తాకాడని, తన ప్రేమకు అడ్డువస్తున్నాడని తోటి స్నేహితుడి పై క్రూరంగా ప్రవర్తించి శరీర భాగాలను వేరుచేసి గుండెను కోసి ప్రియురాలికి వాట్సాప్ లో ఫోటోలు పంపడం సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పరిధిలో జరిగిన ఈ హత్య ఉదాంతం అందర్నీ విస్మయనికి గురిచేస్తుంది. వివరాల్లోకి వెళితే.. నాగకర్నూల్ జిల్లా సిరినగండ్ల కు చెందిన నేనవత్ నవీన్, హరికృష్ణ ఇద్దరూ ఇంటర్ చదువుతున్న సమయం నుండే స్నేహితులు కాగా వీరు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. కాగా నవీన్ హరి ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఇది మనసులో పెట్టుకొని కక్ష పెంచుకున్న హరిహర కృష్ణ ఈ నెల 17వ తేదీన పార్టీ చేసుకుందామని చెప్పి హైదరాబాద్ పరిధిలోని అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన స్నేహితుడి రోజుకి నవీన్ ను పిలిపించుకొని పార్టీ చేసుకోగా వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తను ప్రేమించిన అమ్మాయికి నవీన్ క్లోజ్ గా ఉండడాన్ని జీర్ణించుకోలేని హరి నవీన్ ను దారుణంగా హత్య చేసి గుట్టలో పడేశాడు.. ఇంతటితో ఆగకుండా తన ప్రేయసిని తాకిన చేతి వేళ్లను. పెదాలను ముక్కలు ముక్కలుగా కోసి నిన్ను తాకిన చేతులు పెదాలు అంటూ వాట్సాప్ లో హరి తన ప్రేయసికి ఫోటోలు పంపాడు. దీంతోపాటు గుండెను కోసి ఇదిగో నిన్ను ప్రేమించిన గుండె అంటూ ఫోటోలు పంపిస్తే సదరు యువతి ఆ ఫోటోలకు వెరీ గుడ్ బాయ్ అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దీంతో నాలుగు రోజులైనా కళాశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన నవీన్ తండ్రి ఈనెల 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులకు అబ్దుల్లాపూర్ శివారులో నవీన్ మృతదేహం లభ్యమైనది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :