Thursday, 25 June 2026 10:07:36 PM

వికారాబాద్ జిల్లాలో దారుణం....

శివారెడ్డి పేట వద్ద చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఒక్కరు గల్లంతు

Date : 25 December 2023 10:16 AM Views : 642

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది..తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఉదయం కారు వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా పొగ మంచు కారణంగా శివారెడ్డి పేట వద్ద చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో కారులో 5 గురు ఉండగా ఒక్కరు గల్లంతు కాగా నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. అయితే గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే క్రేన్ సాయంతో కారును అధికారులు బయటకు తీసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :