ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. హైదరాబాద్ లో తెలంగాణ వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఐతే నర్సాపూర్ లో జరిగిన పాదయాత్రలో షర్మిలపై కొందరి అధికార పార్టీకి చెందిన నేతలు దాడులు చేయడంతో పాటు బస్సు, కారు అద్దాలు ధ్వసం చేసి రాళ్లు రువ్వారు. దీంతో పలిగిన కారుతోనే స్వయంగా ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న షర్మిలను పోలీసులు వాహనంలో ఉండగానే క్రేన్ తో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం సంచలంగా మారింది. దీంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న వైఎస్ విజయమ్మ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను పరామర్శించేందుకు వెళ్లగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దీంతో వారిపై విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నా కూతురిని చూసే హక్కు కూడా లేదా అంటూ పోలీసులను ప్రశ్నించినట్లు తెలుస్తుంది.
Admin
Aakanksha News