ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : పిల్ల పుట్టకముందే... కొలతలు తీసుకొని కుళ్ళ కుట్టినట్టుంది... రామగుండం నియోజకవర్గంలోని ఓ నాయకుడి పరిస్థితి... ఓవైపు సదరు నాయకుడు తీరుపై భగ్గుమంటున్న క్రమంలో పక్కనే ఉన్న కొంతమంది నాయకులు సదరు నేతకు ఇచ్చిన ఉచిత సలహాల ప్రభావమో.. లేక మరేతర కారణాలు తెలియదు కానీ రామగుండం ఎరువుల కర్మాగారం విషయంలో కింది స్థాయి ఓ కోకిల తొందరపడి ముందే కూసింది.. దీంతో సదులు నేతకు ఈ వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎవరికివారు అభ్యర్థులు తమ ప్రచారాలను ముమ్మరంగా కొనసాగిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఓ పార్టీకి చెందిన నేత తన మీద వస్తున్న ఆరోపణలను కప్పిపుచడానికో, లేక తన దగ్గర ఉండే కొందరు కింది స్థాయి నాయకులు ఇచ్చిన ఉచిత సలహానో తెలియదు కానీ ఇప్పుడు ఆర్ఎఫ్ సీఎల్ బాధితులు తమకు న్యాయం చేయాలని లేదంటే ఇంటింటికి గడపగడపకు తిరుగుతూ తాము కూడా ప్రచారాన్ని మొదలు పెడతామని అల్టిమేటం జారీ చేయడం ప్రస్తుతం రామగుండం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.. దీనికి తోడు ఈ మధ్యకాలంలో వస్తున్న ఆరోపణల నేపద్యంలోనే పర్యటనలు రద్దు అవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఎన్నికలవేళ ఏదో చేద్దామనుకొని మరేదో చేయడంతో ఉన్నది కాస్త చేజారినట్టు తయారైందనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి...
Admin
Aakanksha News