ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ సూపర్ వైజర్ చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... ప్రభుత్వాసుపత్రిలో సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ యువకుడు అదే ఆసుపత్రి లో పని చేస్తున్న ఓ యువత పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. అయితే సదురు సూపర్ వైజర్ చేసిన నిర్వాకాన్ని యువతి తమ ఓ ఇంచార్జీకి విషయాన్ని తెలపడంతో ఇదే విషయంపై సూపర్ వైజర్ ను నిలదీయడంతో తనకు సంబంధించిన కొంత మంది వ్యక్తులు ఇంచార్జీ పై దాడికి ప్రయత్నించేందుకు ఓ గ్యాంగ్ ఆసుపత్రికి వెళ్ళినట్లు జోరుగా చర్చలు సాగుతున్నాయి. సదురు సూపర్ వైజర్ చేసిన నిర్వాకం ఆసుపత్రి మొత్తం కొడైకొస్తుంది.. ఇప్పటికే సదురు సూపర్ వైజర్ ను కాంట్రాక్టర్ పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.
Admin
Aakanksha News