Monday, 11 May 2026 05:05:52 PM

అమ్ముడుపోయే నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలి...

తెలంగాణ లేబర్ పార్టీ అధ్యక్షులు గొర్రె రమేష్

Date : 28 October 2022 02:08 PM Views : 507

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సిబిసిఐడి తో విచారణ జరిపించాలని తెలంగాణ లేబర్ పార్టీ అధ్యక్షులు గొర్రె రమేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి భారతీయ జనతా పార్టీ పంపించిందని ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు నందకుమార్,సింహయాజి, రామచంద్ర భారతీలను కోర్టులో హాజరు పరిచినప్పుడు పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లు అవినీతి చట్టం కిందికి రావని ఎసిబి జడ్జి రిమాండ్ ను నిరాకరించడం అభినందనియమని అన్నారు. రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు చేసినటు వంటి తప్పులను కోర్టులు మాత్రమే నియంత్రించగలవని ఈ సంఘటన ద్వారా జడ్జి రుజువు చేశారని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద విశ్వాసము లేనటువంటి బిజెపి,టిఆర్ఎస్ గాని ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను అంగట్లో గొర్రెల మందల్ల కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ నుంచి మొదలు కొని ఎంపీ వరకు వివిధ రాజకీయ పార్టీలు ముఖ్యంగా బిజెపి టిఆర్ఎస్ పార్టీలు కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ అనేక రాజకీయ పార్టీల నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేసి ఆయా రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అదే విధంగా దేశంలోని అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలను కొని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. కర్ణాటక మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను కొనుగోలు చేసి బీజేపీ రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అధికారంలోకి వస్తున్నాయన్నారు. టిఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 100 కోట్లు ఆశ చూపి కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులను పార్టీలను అదేవిధంగా అట్టి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై టిఆర్ఎస్ బిజెపి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయని విమర్శించారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ పార్టీలను ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేదెవరు అమ్మేది ఎవరు లావాదేవీలు జరిపిందెవరు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తం వ్యవహారమంతా బయటకు రావాలంటే ఈ సంఘటనను సిట్టింగ్ హైకోర్టు జడ్జితో సిబిసిఐడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేయించి వాస్తవాలను బయటకు తీసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మొన్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి అందులో కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నుంచి గెలిచి టిఆర్ఎస్ చేరారని ఇప్పుడు టిఆర్ఎస్ మీద మోజు తీరడంతో గెలిపించిన ప్రజల్ని మోసం చేసి మరో పార్టీకి అమ్ముడు పోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇట్లా అమ్ముడు అయినటువంటి వ్యక్తులకు ఆయా రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వద్దని ఒకవేళ డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చిన వీళ్లను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను,ప్రజాప్రతినిధులను కొన్నప్పుడు లేని నీతి ఇప్పుడు బిజెపి వాళ్ళు చేస్తే మీకు ఎలా అవినీతి అనిపించిందని ప్రశ్నించారు. ఈ విలేఖరుల సమావేశంలో న్యాయవాది మంథని మల్లేష్ కొమ్మిడి సుగుణాకర్ రెడ్డి అల్లెపు తిరుపతి కన్నం భానుచందర్ MD షలీమ్ G N రావు జి అఖిల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :