Saturday, 18 January 2025 09:28:55 AM

పార్లమెంటులో వంశీని గెలిపిస్తే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా...

షాద్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Date : 24 January 2024 06:20 PM Views : 510

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / రంగారెడ్డి జిల్లా : పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్ల వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తామని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత సమావేశం కార్యక్రమం బుధవారం కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు సిడబ్ల్యుసి సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి, కల్వకుర్తి, జడ్చర్ల, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, అనిరుద్ రెడ్డి, వాకిట శ్రీహరి, మధుసూదన్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన కీలక నాయకులు మామిడి శ్యాంసుందర్ రెడ్డి, తాండ్ర కాశీనాథ్ రెడ్డి, జడ్పిటిసిలు వెంకటరామిరెడ్డి, కేశంపేట జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి, నందిగామ ఎంపీపీ ప్రియాంక గౌడ్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, చెంది తిరుపతి రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ నాయకులతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి చల్లా వంశీచంద్ రెడ్డి అని అన్నారు. క్రమశిక్షణతో ఉన్న నాయకుడని, చెప్పిన మాట జవదాటకుండా ఏదైనా హామీ ఇస్తే దానిని నెరవేర్చడానికి ముందుంటారని కొనియాడారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పాలమూరు గొంతును వినిపించి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు తగిన న్యాయం చేసే వ్యక్తి వంశీచంద్ రెడ్డి అని అన్నారు. ప్రస్తుతం ఉన్న పాలమూరు ఎంపీ ఏమాత్రం చేతకాని దద్దమ్మ అంటూ కీలక విమర్శలు చేశారు. పాలమూరు ప్రాజెక్టు పనుల కోసం కేంద్రంతో మాట్లాడని అసమర్ధ ఎంపీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు గురించి పట్టుకునే పట్టించుకునే వారి గత ప్రభుత్వంలో కరువయ్యారని అప్పటి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అందుకు చల్ల వంశీ రెడ్డిని పెద్ద ఎత్తున గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యకర్తలకు సూచించారు.

వారికి "భయం" ఏంటో చూపిస్తా..

గత పదిఏళ్ల కాలంలో టిఆర్ఎస్ నాయకులు, పాలకులు సాగించిన అక్రమ దందాలు, అవినీతి కార్యకలాపాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులపై స్పందిస్తానని దెబ్బకు దెబ్బ అన్నట్టు టిఆర్ఎస్ నాయకులకు భయం అంటే ఏమిటో రుచి చూపిస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఏడిపించుకు తిన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆయన కుమారుల దాస్టికాలపై స్పందిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంతకు అంతా అనుభవించేలా చూస్తానని హెచ్చరించారు. ఒక దశలో సహనం కోల్పోయి మాజీ ఎమ్మెల్యే అంజయ్య పై పరుష పదజాలాలతో విరుచుకుపడ్డారు. ఆయన అధికారంతో కుమారులను నియోజకవర్గంపై వదిలి ప్రజలను పీడించి పైశాచిక ఆనందం పొందారని ఇకపై వారి ఆటలు కొనసాగవని చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని శంకర్ అన్నారు. గత పాలకుల కళ్ళలో భయం అంటే ఏమిటో చూపెడతానని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు