ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేస్తారని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ రాబోతుందని, పార్టీ పెట్టి షర్మిల తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనుందని అన్నారు. తుఫ్రాన్ లో రఘునందన్ రావు పర్యటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై జోస్యం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కవితతో పార్టీ పెట్టిస్తున్నారని అన్నారు. తండ్రి, కుమార్తె మధ్య మధ్యవర్తులెందుకు? అని ప్రశ్నించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారని, ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యారని విమర్శించారు. దెయ్యాల మధ్య పదేళ్ల రాజకీయం ఎందుకు? అని రఘునందన్ ఎద్దేవా చేశారు.
Admin
Aakanksha News