Tuesday, 11 August 2026 06:40:32 PM

తనపై నమోదైన కేసును కొట్టివేయండి...

హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్

Date : 28 January 2025 06:44 AM Views : 633

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బిజెపి నేత, మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈటల రాజేందర్ ఇటీవల పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఏకశిలానగర్‌లో సామాన్యుల భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు గూండాలను,కుక్కలను పెట్టి ఏకశిలానగర్ వాసులను బెదిరిస్తున్నారని, ఈ క్రమంలో వారి వద్దకు వెళ్లిన సమయంలో వారి తీరు పట్ల ఆగ్రహంతో చేయి చేసుకున్నట్లు ఈటల ఇదివరకే వెల్లడించారు. అయితే రియాల్టీ వ్యాపారిపై దాడి నేపథ్యంలో పోచారం పోలీసు లు కేసు నమోదు చేశారు. వాచ్‌మన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయిం చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :