Friday, 25 September 2026 04:59:06 PM

ఎల్ఐసి పాలసీలతో కుటుంబాల జీవితాలకు రక్షణ...

ఎల్ఐసి 2024 డైరీని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Date : 30 December 2023 04:47 PM Views : 623

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా ఎల్ఐసి చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ లయన్ కె ఎన్ సామ్రాట్ ఆద్వర్యం లో హిమాయత్ నగర్ బ్రాంచ్ తరపున రూపొందించిన నూతన సంవస్సతరం 2024 డైరీని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్ఐసి సంస్థలో గత 20 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించి 4000 పైగా పాలసీలను చేయించిన సామ్రాట్ చేస్తున్న సేవలను అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాలను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎల్ఐసి పాలసీలు తీసుకుని కుటుంబాలకు రక్షణ కల్పించాలని మంత్రి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు చిక్క దేవదాసు,బీసీ సంక్షేమ సంఘం మహిళా రాష్ట్ర కన్వీనర్ బిల్లా దీపిక, ఆదర్శ కిరణం ఎడిటర్ వంగాల బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :