Saturday, 26 September 2026 07:23:43 AM

జెండాలు తీసేసినంత మాత్రాన భూ పోరాటం ఆగదు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి.

Date : 19 March 2023 04:18 PM Views : 626

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూ పోరాటం 2వ రోజుకు చేరింది. వందలాదిమంది నిరుపేదలు గుడిసెలు వేసుకోవడానికి చెట్లు కొట్టి జెండాలు పాతడంతో రాత్రి పోలీసులు జెండాలు పాతిన స్థలాలకు చేరుకుని జెండాలు తొలగించారు. భూకబ్జా దారుల నుండి భూములు కాపాడాల్సిన వారు ఆ పని చేయకుండా పేదలు వేసుకున్న జెండాలు తీయడం ఏంటని అన్నారు.జెండాలు తీసేసినంత మాత్రాన పోరాటం ఆగదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చేతనైతే కబ్జా దారులనుండి ప్రభుత్వ స్థలాలు కాపాడాలని సూచించారు.ఈ పోరాటం పేదలకు ఇంటి స్థలాలు, పట్టాలు ఇచ్చేంతవరకు ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.మహేశ్వరి, జిల్లా కమిటి సభ్యులు మెండే శ్రీనివాస్,లావణ్య, నాయకులు ఫైముద,పీర్ మహ్మద్, నాగమణి,లలిత, ఓదెలు, గోపాల్,లక్ష్మీ నారాయణ, సంజీవ్, రామన్న, వేల్పుల రవి,సమ్మక్క,గౌస్, సందీప్ సాగర్,శంకర్ లతో పాటు అధికసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :