ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / యాదాద్రి భువనగిరి జిల్లా : కుటుంబ సమేతంగా దైవ దర్శనం కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన నేపథ్యంలో బాలుడు ప్రమాదానికి గురైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన ఓ కుటుంబం శనివారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చారు. అక్కడే నిద్ర చేసిన అనంతరం మరుసటి రోజు ఉదయం లక్ష్మినరసింహస్వామి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక దర్శన క్యూ లైన్ లో నిలబడ్డారు. అయితే వారి దంపతుల కుమారుడు దయాకర్ సరదాగా ఆడుకుంటూ క్యూలైన్‌లోని గ్రిల్‌లో తల పెట్టడంతో బాలుడి తల అందులోనే ఇరుక్కుపోయింది. దింతో ఒక్క సరిగా బాలుడి తల్లి దండ్రులు ఆందోళనకు గురైయ్యారు. అక్కడే ఉన్న స్థానిక భక్తులు సకాలంలో స్పందించి గ్రిల్ రాడ్లను పక్కకు తొలగించి బాలుడి తలను తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
Admin
Aakanksha News