Thursday, 25 June 2026 06:44:32 PM

నిరసన బాట పట్టిన బెటాలియన్ కానిస్టేబుల్స్....

ఎస్సై సైదాబాబుని సస్పెండ్ చేయాలని ఆందోళన...

Date : 26 October 2024 01:24 PM Views : 378

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబుని సస్పెండ్ చేయాలని బెటాలియన్ కానిస్టేబుల్స్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...తెలంగాణలో ఒకే రాష్ట్రం.. ఓకే పోలీస్ విధానం అమలు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మా కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరైనది కాదన్నారు. తమ కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడిన సైదాబాబును తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుల్స్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :