Friday, 25 September 2026 06:09:21 PM

కార్మికుల సౌకర్యాలపై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం

హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్

Date : 05 November 2022 11:44 AM Views : 685

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కార్మికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఎస్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కోల్ బెల్ట్ ఏరియాలో వరుస దొంగతానాలు జరుగుతున్నాయని పోలీసులు పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలకు సూచనలు చేస్తుంటే దీనిని సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని అన్నారు. సింగరేణి క్వాటర్స్ లో అధికారులకు కల్పించిన సౌకర్యాలు కార్మికులకు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. కార్మికులు పని చేస్తేనే సింగరేణికి లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి సింగరేణి క్వాటర్ కి కపోండ్ వాల్ తో పాటు తలుపులు, కిటికీలు. మెస్ డోర్ లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు కష్టపడి ఉత్పత్తిని సాధించి లాభాలు తీసుక వస్తుంటే అధికారులు విలాసవంతమైన సౌకర్యాలను అనుభవిస్తున్నారని అన్నారు. అలాగే అర్ ఓ అర్ మంచినీరు సరఫరా చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని మళ్లీ కార్మికులకు మురుగు నీటిని అందిస్తున్నారని అన్నారు. అంతే కాకుండా కొన్ని కాటర్స్ మద్యం బాబులకు నీలయంగా మారుతున్నాయని వెంటనే దీనిపై సింగరేణి యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు.విలేకరుల సమావేశంలో నాయకులు సమ్మయ్య, రమేష్, రామచంద్ర రెడ్డి, గోపాల్, బోయిని శ్రీనివాస్, కుమారస్వామి, మల్లేష్, గట్టు స్వామి, చరణ్ రెడ్డి, లక్ష్మీనారాయణ, నరేందర్, సదయ్య, ఖాదర్ అలీ, లవకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :